ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాలే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో చోరీ జరిగిన కొద్దిరోజులకే, బేల మండలం సిర్సన్న సింగపూర్ హనుమాన్ ఆలయంలో తాళం పగులగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. నగదు దోచుకున్న అనంతరం హుండీని బయట పడేశారు. వరుస ఘటనలతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.