ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నాయకులతో పాటు ఆశావహులు సైతం రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో లేవో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మార్చే అవకాశం ఉంది. దీంతో వార్డుల రిజర్వేషన్ అంశంపై చర్చ జరుగుతోంది.