ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు ఒకే రాత్రి మూడు చోట్ల చోరీలకు యత్నించి ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఖిజార మసీదు సముదాయంలోని కంప్యూటర్ సెంటర్, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ షట్టర్ తాళాలు పగలగొట్టారు. రెవెన్యూ గార్డెన్ సమీపంలోని వందన కిరాణా షాపులోనూ, దస్నాపూర్ వద్ద ఉన్న దుర్గా రెస్టారెంట్ బార్‌లోనూ దొంగతనానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.