ఉమ్మడి జిల్లాలోని రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై ఈ నెల 27న హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, గృహ నిర్మాణ కార్యక్రమాల అమలు, రెవెన్యూ అంశాలపై చర్చించనున్నారు. ఈ కారణంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది.