ఆదిలాబాద్: కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల దీక్షలు

2చూసినవారు
ఆదిలాబాద్: కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల దీక్షలు
సాత్నాల మండలం దుబ్బగూడలో ఆదివాసీలు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రెవెన్యూ స్థలంలో ఇళ్లు కట్టుకుంటున్నా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సీపీఎం నేత లంక రాఘవులు ఆరోపించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్