ఆదిలాబాద్: డ్రైవర్‌ను మోసం చేసి డబ్బు దోచుకున్న ఇద్దరు అరెస్ట్

2చూసినవారు
ఆదిలాబాద్: డ్రైవర్‌ను మోసం చేసి డబ్బు దోచుకున్న ఇద్దరు అరెస్ట్
ఆదిలాబాద్ గ్రామీణ మండలం చిచ్రి ఖానాపూర్కు చెందిన రారోడ్ యువరాజ్, జాదవ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు హార్వెస్టర్ డ్రైవర్ సర్దార్ విక్రం సింగ్ వద్ద నుంచి రూ.50 వేల నగదు, చరవాణిని దొంగిలించారు. గత నెల 21న రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిని మద్యం తాగించి, అతని ఫోన్ పే పాస్‌వర్డ్ తస్కరించి, డబ్బు బదిలీ చేసుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాధితుడిని నిర్మల్ జిల్లా ఖానాపూర్ దారిలో అటవీ ప్రాంతంలో వదిలేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్టు చేసి, ఆటో, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్