గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో భద్రపర్చినట్లు ఆర్ఎంఓ తొడసం చందు తెలిపారు. ఈ నెల 6న రిమ్స్ లోని క్షయ వార్డులో బాధితుడు చేరాడన్నారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పేర్కొ న్నారు. మృతుడిని గుర్తించటానికి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఎవరైనా గుర్తిస్తే రిమ్స్ లో లేదా ఆదిలాబాద్ టూటౌన్ పీఎస్ లో సంప్రదించాలని సూచించారు.