శనివారం బేల మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి కులస్తులు విశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేసి, ప్రపంచ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. కులస్తులందరూ ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఒల్లప్ వార్ భాగ్య లక్ష్మి, ఎస్ఐ ప్రవీణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.