ఆదిలాబాద్: వీవోఏల సమస్యలు పరిష్కరించాలి

1చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఐకెపీ వీవోఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాజోఉద్దీన్ ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, ఐకెపీలో పనిచేస్తున్న వీవోఏల సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. వీవోఏలకు కనీస వేతనం ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వీవోఏలకు సీసీ పదోన్నతి కల్పించాలని, 58 జీవోను సవరించి ఆరోగ్య బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.