ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, గాయత్రి, పొచ్చేరా జలపాతాలు భారీగా నీటితో కళకళలాడుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. వర్షాల కారణంగా పచ్చని అడవుల మధ్య సందర్శకులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. అయితే, ఈ జలపాతాల వద్ద సౌకర్యాలను మెరుగుపరచాలని పర్యాటకులు కోరుతున్నారు.