మంగళవారం, బేల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. బేల మండలం చక్రాలకు చెందిన బోట్ల వంశీ యాదవ్ అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఐడీలో ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా పోస్ట్ చేశాడని, దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచామని, ప్రజలు మత సామరస్యాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.