ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసుల ధర్నా

591చూసినవారు
ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ పేర్కొన్నారు. మావల మండలం కొమరంభీం గూడలో మౌలిక వసతులతో పాటు కరెంటు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆదిలాబాద్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you