ఆదివాసీలు విద్య కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి: ఎస్పీ

0చూసినవారు
ఆదివాసీలు విద్య కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి: ఎస్పీ
గాదిగూడ మండలం పొన్నూరు గ్రామంలో ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ప్రారంభించారు. ఆదివాసీ డప్పు వాయిద్యాల నడుమ ఎస్పీకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆదివాసీలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, నాటు వైద్యం కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. అభివృద్ధి కోరుకునేవారు సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని, వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్