వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం

965చూసినవారు
మంగళవారం ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హల్‌లో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటల్లో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. ఎం బాల్ రాజ్, విస్తరణ సంచాలకులు డా. యాకాద్రి, పలువురు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు, చీడపీడల నివారణపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్