తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను భారత జాతీయ మహిళా సమాఖ్య ఘనంగా నిర్వహించారు. శనివారం సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అమీనా ఖాన్ తదితరులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ పోరాటం ఆదర్శమన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.