కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ఏఐటీయూసీ తీరుకు ఆకర్షితులై కార్మికులు తమ యూనియన్‌లో చేరుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలోని యూనియన్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్4ఎస్ ఏజెన్సీకి చెందిన పది మంది కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. వారికి కండువాలు కప్పి యూనియన్‌లో ఆహ్వానించారు.