
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఇద్దరు గల్లంతు
AP: బాపట్ల జిల్లాలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ అనే విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా చినగంజాం మండలం పల్లిపాలెం బీచ్‌కు నలుగురు విద్యార్థులు వెళ్లారు. ప్రమాదవశాత్తు, శ్రీరామ్, అవినాష్ అనే ఇద్దరు విద్యార్థులు బీచ్‌లో గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హేమసాయి, హేమవర్ధన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.




