షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళిక 2025-26లో భాగంగా అమలు చేయనున్న పశు పోషణ (మిల్స్ అనిమల్స్) పథకం కింద ఆన్‌లైన్ నమోదు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల యువత https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.