ఆదిలాబాద్ జిల్లా, బోథ్ లోని ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన డా. జె. అనితను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు,
విద్యార్థులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ పదోన్నతి అనేది ఉద్యోగి ప్రతిభ, కృషి, సేవలకు గుర్తింపు అని, ఇది ఉన్నత స్థాయికి చేరడంతో పాటు బాధ్యతను పెంచుతుందని తెలిపారు. డా. అనితకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.