బజార్ హత్నూర మండలం పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి చేరుకుని ప్రజలకు హామీల అమలు పత్రాలు అందజేస్తూ సభలో ప్రసంగిస్తారు.