ఇంద్రవెల్లి మండలం సమక గ్రామ పంచాయతీ పాట గూడ లో బుధవారం మండల తహసీల్దార్ ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో డీవీఎంసీ మెంబెర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, భూ అక్రమాలను నివారించడానికి అట్రాసిటీ చట్టం ఆయుధం లాంటిదని, చట్టాన్ని అందరూ తెలుసుకుని తమ హక్కులను కాపాడుకోవాలని, కుల వివక్ష, అస్పృష్యత నివారణలో అన్ని కులాల వారు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమక సర్పంచ్ రాజేష్, ఎంపీడీఓ మహేందర్, ASI నాగేశ్వర్, SW వార్డెన్ రవీందర్, AEO శ్రవ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.