ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న వసుంధర షాపింగ్ మాల్‌లో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. చెట్టుపైకి ఎక్కి పైకప్పు రేకులు తొలగించి లోపలికి చొరబడ్డారు. సీసీ కెమెరాల తీగలను తొలగించి క్యాష్ కౌంటర్లను వెతికారు. అయితే, ఎలాంటి నగదు చోరీకి గురికాలేదని మాల్ యాజమాన్యం తెలిపింది. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్ కుమార్, ఎస్సై అశోక్, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.