ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని, జనగణన, భూభారతి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.