గ్రహణం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన

1చూసినవారు
గ్రహణంపై మూఢనమ్మకాలను విడనాడాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద చంద్రగ్రహణం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వేదిక సభ్యులు గ్రహణ సమయంలో బిస్కెట్లు తిని, నీళ్లు తాగారు. గ్రహణ సమయంలో తినడం, తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని వారు స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి ధైర్యం నింపడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్