సైబర్ నేరాలపై అవగాహన: గ్రామ సర్పంచ్ సూచనలు

625చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన: గ్రామ సర్పంచ్ సూచనలు
ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ గ్రామ సర్పంచ్ నోముల సంతోష్ రెడ్డి, గుర్తు తెలియని ఫోన్ నంబర్లు, మెసేజ్ లకు స్పందించవద్దని గ్రామస్థులకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల చైర్మన్, గ్రామస్థులు, యువత పాల్గొన్నారు. ప్రజలు తమ ఫోన్ లకు వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్