ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని భీంపూర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ ఎస్. కృష్ణ పాల్గొన్నారు. పీఎంజేడీవై, పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ప్రయోజనాలను వివరిస్తూ, అర్హులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాతాదారులు కేవైసీ అప్డేట్, నామినీ నమోదు చేసుకోవాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి, 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు.