బహుజన్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం సోమవారం జరిగింది. పార్టీ ఛీఫ్, జోన్ ఇన్‌ఛార్జ్ అడ్వకేట్ రామచంద్రం మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్
ఎన్నికలు కీలకమని, పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని
బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.