త్యాగానికి ప్రతీక అయిన ఈద్ అల్ అధా (బక్రీద్) పండుగను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు భారీగా తరలివచ్చి సామూహిక నమాజ్ చేశారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.