ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఆయన బతుకమ్మకు పూజలు చేసి, ఉద్యోగులతో కలిసి దాండియా ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎఫ్ఓ బాజీరావు పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ సలోని, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.