సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

599చూసినవారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత సమాజంలో సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ టీటీడీసీలో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత విస్తరణతో పాటు సైబర్ నేరాల పెరుగుదలను అరికట్టడానికి ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సదస్సు నొక్కి చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్