
రూ. 3 లక్షల వరకు వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. అతి తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు అందించే వడ్డీ రాయితీ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద, రైతులకు 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. ఈ నిర్ణయం రైతులకు పెట్టుబడుల కోసం ఆర్థికంగా అండగా నిలుస్తుంది.




