బేల మండలంలో అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసి గ్రామాలలో గత ఏడాది ప్రారంభం కావలసిన పనులు నేటికీ ప్రారంభం కాలేదని, వెంటనే వాటిని ప్రారంభించి, ఆదివాసీలకు సౌకర్యాలు కల్పించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రూపేష్ కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ శివరాంను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.