అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బేల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా అని వారు ప్రశ్నించారు.