ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ గ్రామ పంచాయతీ పరిధిలో రాయ్ సెంటర్ గిరిజన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు. ఈ కేంద్రాలు గిరిజన యువత సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.