ఆదిలాబాద్ రూరల్ పట్టణ శివారులోని చాంద(టి) వాగులో ఆదివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ విష్ణువర్దన్, సిబ్బంది పరిశీలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659924 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.