భారతీయ బౌద్ధ మహాసభ సెంట్రల్ కమిటీ శిక్షకులు యువరాజ్ మోరే, గౌతమ బుద్ధుని శాంతి సందేశాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో బౌద్ధ పౌర్ణిమ సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో పంచశీల జెండాను ఆవిష్కరించి, బౌద్ధ వందనం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. మానవాళికి శాంతి సందేశమిచ్చిన బుద్ధుడు పౌర్ణిమ రోజునే జన్మించారని, బౌద్ధ ఉపాసకులు ఈ రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటారని తెలిపారు.