సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

4చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జైనథ్ మండలం బోరజ్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. జోగు రామన్నను అరెస్టు చేసే సమయంలో పార్టీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :