ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో శనివారం రాత్రి బయల్దేరారు. జాతీయ రహదారి 44పై బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడు నిద్రలోనే మృతిచెందగా, తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో తన కుమారుడు ఎక్కడంటూ తల్లి రోదిస్తుండటం అందరినీ కలచివేసింది. ఈ సంఘటనలో మొత్తం ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.