ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అందుబాటులో లేని స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. రాజధాని పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లిన ఓటర్లకు అభ్యర్థులు పదేపదే ఫోన్లు చేస్తూ, ఊరికి వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా, తమకే ఓటు వేయాలని కోరుతూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో ఈ తరహా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.