రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ముగ్గురిపై కేసు

0చూసినవారు
రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ముగ్గురిపై కేసు
సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సిరిచెల్మ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్, యూనుస్, జాడి జస్వంత్ లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో అలజడి సృష్టించే వారిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్