ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మద్యం మత్తులో అకారణంగా హంగామా సృష్టించిన ఎల్టి సన్నిరెడ్డి అనే యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన సన్నిరెడ్డి, బయట గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి రాత్రి వచ్చాడు. అక్కడ మద్యం మత్తులో న్యూసెన్స్ చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కే. నాగరాజు తెలిపారు.