ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల పాలకవర్గాల నియామకాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కీలక పదవులు దక్కడంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లాలోని ప్రధాన మార్కెట్ యార్డులు, సొసైటీల్లో తమ అనుచరులకు చోటు దక్కడంతో అగ్రనేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కోలాహలం కనిపిస్తోంది.