బేల మండలం చెప్రాల గ్రామానికి చెందిన గుమ్ముల బుదబాయి (100) శతాయుష్షు పూర్తి చేసుకుని, తన కుటుంబానికి మార్గదర్శకురాలిగా నిలిచిన అనంతరం శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమె, వందేళ్లు వచ్చినా చివరి వరకు ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపడం అరుదని గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.