ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 7వ వార్డు కౌన్సిలర్ రాము మాట్లాడుతూ, ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆమె ధైర్యం, తెగువ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు, దొరలకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి ఐలమ్మ అని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి శశికాంత్, ఎల్చాలా పోచన్న, పాయల్ రాజు, కుర్ర సాయి, అఖిల్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.