ఆదిలాబాద్ ఎస్ఈ శేషారావు మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యంగా శాఖలో సాంకేతిక మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, మరమ్మతుల సమయంలో సరఫరా ఆగకుండా ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. జిల్లాలోని మొత్తం 51 సబ్ స్టేషన్లలో 33 కేవీ లైన్ల ఇంటర్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేశామని, దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆయన వివరించారు.