బుధవారం తెల్లవారుజామున తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన గర్భిణీ గంగమణికి పురిటి నొప్పులు అధికమవ్వడంతో, 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆడబిడ్డ జన్మించింది. అంబులెన్స్ సిబ్బంది సంతోష్, సత్యనారాయణ ఈ ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో 108 అంబులెన్స్‌లలో గర్భిణీల ప్రసవాల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఈ సంఘటన నిదర్శనం.