ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుగాట్ ఆశ్రమ హైస్కూల్ ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 14 మంది
విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈ విజయం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమైందని హెచ్‌ఎం ప్రేమ్‌దాస్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన
ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.