కరంజిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

1705చూసినవారు
కరంజిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం కరంజి గ్రామంలో 30.06.2026న పౌర హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక సర్పంచ్ గొంటిముక్కుల శైలజ-పొచ్చన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా MRO ఆత్రం నారాయణ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శశికాంత్, మల్లేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని, కుల వివక్ష, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్