ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై స్పందించిన సీఎం

2చూసినవారు
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై స్పందించిన సీఎం
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అన్ని ఆస్పత్రుల్లో భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్