జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని యాళ్ల సాయి స్మృతి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభకు కొదవలేదని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచి, 600 మార్కులకు 576 మార్కులు సాధించి 96% ఫలితాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆమెను తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.